Volvo XC Price Hike : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తమ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. ఇటీవల కస్టమ్స్ డ్యూటీ పెరుగుదల కారణంగా వోల్వో తమ కార్ల మోడళ్లలో XC40 SUV, XC60 SUV, XC90 SUV, S90 సెడాన్‌లతో సహా మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ధరలను 1శాతం నుంచి 2శాతం వరకు పెంచింది. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించినట్లుగా.. భారత మార్కెట్లో వోల్వో మోడల్‌ల కొత్త ధరలు (ఎక్స్-షోరూమ్) కింద ఇలా ఉన్నాయి.

Volvo XC40 B4 మైల్డ్ హైబ్రిడ్ – రూ. 46.40 లక్షలు
VolvoXC60 B5 మైల్డ్ హైబ్రిడ్ – రూ. 67.50 లక్షలు
Volvo XC90 B6 మైల్డ్ హైబ్రిడ్ – రూ. 98.50 లక్షలు
Volvo S90 B5 మైల్డ్ హైబ్రిడ్ – రూ. 67.90 లక్షలు

ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని కంపెనీ వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. దీని ఫలితంగా వోల్వో కార్ ఇండియా తేలికపాటి హైబ్రిడ్‌ల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయని చెప్పారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం.. సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై ఇప్పుడు 30శాతం నుంచి 35శాతం కస్టమ్స్ సుంకం విధిస్తుంది.

అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి (SWS) రద్దు చేసింది. 40వేల డాలర్ల కన్నా ఎక్కువ ధర, భీమా, సరుకు రవాణా (CIF) విలువ లేదా పెట్రోల్ మోడల్‌లకు 3000cc కన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, డీజిల్ మోడల్‌లకు 2,500cc కన్నా ఎక్కువ మొత్తంలో నిర్మించిన యూనిట్ (CBU) రూపంలో లేదా రెండింటితో పాటు, కస్టమ్స్ సుంకాన్ని 60శాతం నుంచి 70శాతానికి పెంచారు.

కానీ, అంతకుముందు వసూలు చేసిన 6శాతం SWS మాత్రం రద్దు చేసింది. 40వేల డాలర్ల కన్నా ఎక్కువ CIF విలువ కలిగిన వాటికి మినహా CBU రూపంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)పై ఇప్పుడు 70శాతం కస్టమ్స్ సుంకం విధిస్తుంది. అంతకుముందు ఇది 60శాతంగా ఉంది. కానీ, ఇంతకు ముందు సేకరించిన 6శాతం SWS తొలగించింది. వోల్వో స్థానికంగా XC40, XC60, XC90, S90, ఆల్-ఎలక్ట్రిక్ XC40 రీఛార్జ్ SUVలను బెంగళూరు ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తుంది.