NCC క్యాంప్ లో సత్తా చాటిన నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు
ప్రజా వేదిక:23 వ ఆంధ్ర NCC బెటాలియన్ ఆధ్వర్యంలో గత 10రోజులుగా చీరాల లో ఎన్.సి.సి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం నందు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు సత్తాచాటారని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.శ్రీనివాస కుమార్ గారు తెలిపారు.ఈ మేరకు శిక్షణా శిబిరం ఆఖరి రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 23వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ గౌతమ్ చేతుల మీదుగా మెడల్స్ బహుకరించారు. పురుషుల విభాగంలో ఎం.జస్వంత్, బి.యువరాజు, డి. వి హరీష్ మెడల్స్ సాధించగా, మహిళల విభాగంలో ఐ.శృతి, జి.చిన్మయి, బి.వి రాణి లు మెడల్స్ సాధించారు.వీరితో పాటుగా మీరా జాస్మిన్,కావ్య లు ఉత్తమ ప్రతిభ కనపరచి ప్రశంస పత్రాలు అందుకున్నారు.
మెడల్స్ సాధించిన విద్యార్దులను కళాశాల యాజమన్యం ,NCC అధికారి రాజేష్ బాబు,అధ్యాపక మరియు అధ్యపకేతర సిబ్బంది,విద్యార్థులు అభినందించారు.