డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుక భారత 11వ రాష్ట్రపతి,భారతరత్న,మిస్సైల్ మ్యాన్ ఏపిజె అబ్దుల్ కలాం 93వ జయంతి సంధర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
నరసరావుపేటలోని పల్నాడు రోడ్ లో గల ఏపిజె అబ్దుల్ కలాం విగ్రహానికి డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ పేపర్ బాయ్ స్థాయి నుండి భారత దేశ 11 వ రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన గొప్ప మేధావి ఎపిజె అబ్దుల్ కలాం అని అణు వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మక మార్పులతో మనదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ఎపిజె అబ్దుల్ కలాం అని సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధిగాంచిన కలాం క్రమశిక్షణ కలిగిన శాంతి కాముకులు, గొప్ప మానవతావాది అని సృజనాత్మకత, సత్ప్రవర్తన, ధైర్యం మూడింటి మేళవింపును నిజమైన జ్ఞానంగా ఉద్భోధించి విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపడానికి కలాం ప్రయత్నించారని ప్రపంచ శాంతికోసం పరితపించారని భారతదేశ క్షిపణి వ్యవస్థ పితామహుడిగా పేరు గడించి రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించి భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ను అందుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మ జిలాని,షేక్ నాగూల్ మీరా,జానీ,హనుమంతరావు,హరి తదితరులు పాల్గొని ఎపిజె అబ్దుల్ కలాం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.*