ఆయన స్ఫూర్తి భావితరాలకు అనుసరణీయం!
వర్తమాన చరిత్రలో ఏదో విధంగా జీవించడమే గొప్పదనంగా మారింది. నిజాయితీగా, విలువలతో కూడిన జీవితం గడపడానికి ఆసక్తి చూపకపోవడం అవాంఛనీయ
ఆ స్ఫూర్తి భావితరాలకు అనుసరణీయం!
వర్తమాన చరిత్రలో ఏదో విధంగా జీవించడమే గొప్పదనంగా మారింది. నిజాయితీగా, విలువలతో కూడిన జీవితం గడపడానికి ఆసక్తి చూపకపోవడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తున్నది. ఏదో విధంగా జీవించి, తరతరాలకు తరగని ఆస్తిని గడించి, బ్రతుకు చాలించడం వలన ఫలితమేమి? బ్రతికున్నంత వరకు జనం గుర్తించడం, మరణించిన తర్వాత మరచి పోవడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించగలగడం కొందరికే సాధ్యం. అలాంటి జీవితాలు ఆదర్శప్రాయం. భౌతిక దేహాన్ని త్యజించినా, తరాలు మారినా తరగని ఖ్యాతితో మరణమంటూ లేని మహనీయులెందరో మనదేశంలో జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నందా వంటి నిజాయితీ పరులు, నిస్వార్థ దేశభక్తులు జన్మించిన భరత భూమిపై నేటి తరం జనానికి తెలిసిన ఆణిముత్యం అబ్దుల్ కలాం.పేదరికంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి, ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎన్ని అవార్డులు పొందినా, ఎన్ని పదవులు అధిరోహించినా అత్యంత నిరాడంబరంగా జీవించి ప్రజల మన్ననలు పొంది, మరణించిన తర్వాత కూడా భరతజాతి గుండెల్లో సజీవంగా నిలిచిన అబ్దుల్ కలాం ఖ్యాతి చిరస్మరణీయం.జయంతి సందర్భంగా, ఘన నివాళులర్పిస్తూ, వారిని స్మరించుకుందాం.