దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించండి
దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న అట్లూరి విజయ్ కుమార్
అట్లూరి విజయ్ కుమార్ నాయకత్వంలో అందరి సహకారంతో అక్టోబర్ 18 బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 10.00 ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష.
భరత దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులు అభద్రతా భావానికి గురవుతున్నారు. మతం మారినంత మాత్రాన అసమానత, అంటరానితనం పోవడం లేదు. కేవలం కొందరు షెడ్యూల్డ్ కులాల వారు మతం మారడం వల్ల వారి సామాజిక హోదాలో ఎలాంటి మార్పు రావడం లేదు. షెడ్యూల్డ్ కులానికి చెందినవారు మతం మారితే, షెడ్యూల్డ్ కులాలకి దక్కే హోదా మరియు రిజర్వేషన్లను కోల్పోతారని భారత రాజ్యాంగంలో ఎటువంటి క్లాజులు లేదు. కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే ఈ నిబంధన ఉంది. ముందు హిందూమతంలోనే కొనసాగాలని చెప్పారు. తరువాత సవరించి సిక్కు లేదా బౌద్ధ మతాలలో కూడా కొనసాగించవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు 1950లోని పేరా-3 ను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించాలని భారత జాతీయ దళిత క్రైస్తవుల ఫోరం తరపున డిమాండ్ చేస్తున్నాం.1950 రాష్ట్రపతి ఉత్తర్వులలోని 3వ పేరా ఆధారంగా షెడ్యూల్డ్ కులాల వారు హిందూయేతర మతాలను స్వీకరిస్తే వారు షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిoపబడరని, SC లకి రావలసిన రిజర్వేషన్ సంక్షేమ ఇతర ఫలాలకు అనర్హులుగా చేస్తూ వక్రమార్గంగా ఇచ్చిన ఆర్డర్ ఆర్టికల్ 25 కు వ్యతిరేకమని, ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగానికి విరుద్ధమని, ఈ ఆర్డర్ ను సమీక్షించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది.. పంజాబ్ హర్యానా స్టేట్ హై కోర్ట్ సివిల్ అప్పీల్ నంబర్. 4870 ఆఫ్ 2015 కేసులో కులం మతం వేరని, ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతన్నైన ప్రాక్టీస్ చేయవచ్చని, కులం పుట్టుకలోనే రక్తంలోను, సాంప్రదాయంగా సంక్రమిస్తుంది. విశ్వాసం మీద ,నమ్మకం మీద ఎన్ని మతాల అయినా స్వీకరించవచ్చని తీర్పునిస్తూ ,ఎస్సీ కులంలోనే పుడితే చివరి వరకు ఎస్సీ గానే ఉంటాడు, మతం కులాన్ని మార్చలేదని స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1995 నుండి 1997 వరకు వేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికతో పాటు పలు కమిషన్లపై విషయాన్ని ధృవీకరిస్తూ దళితుడు ఏ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా కల్పించాలని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లోఎస్సీ హోదా నిరాకరించబడిన దళిత సిక్కులు 1956లో దళిత బౌద్ధులు మత స్వేచ్ఛకై పోరాడితే 1990వ సంవత్సరంలో 1950 ఎస్సీ మూడో పేరా సవరించబడి, ఎస్సీ హోదా సాధించుకొని మత స్వేచ్ఛను కాపాడుకోగలిగారు. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సి హోదా కల్పించాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపు 15 పిటిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఈ అంశంపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్లు అందజేయడం కూడా జరిగింది. ఈమధ్య కాలంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని బెదరాల్సిన భయపడవలసిన అవసరం లేదు. ఈ తరపున కూడా సుప్రీంకోర్టు కొట్టి వేయనుంది.
కావున దళిత క్రైస్తవులు ఏకమై ఒక మహా లోకమై తప్పుడు మార్గంలో ఇచ్చిన రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా _3 తొలగించే వరకు పోరాటం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దళిత క్రైస్తవ క్రిస్టియన్ ఫోరం జాతి అధ్యక్షులు అట్లూరి విజయకుమార్ గ నాయకత్వంలో అందరి సహకారంతో 2023, ఉదయం 10:00 నుంచి సాయంత్రం మూడింటి వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష జరిగిందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ దళిత క్రైస్తవ నాయకులు Dr.రంజిత్ ఓఫీర్ , ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు, జాతీయ నాయకులు కోలా ప్రసాద్, మాదిగ సేన బెంజిమెన్, సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ముందే మురళి గారు, ఘంటసాల ధర్మారావు గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు, జల్ది మోజేష్ గుంటూరు జిల్లా అధ్యక్షులు, గుండెబోయిన జాషువా, రాష్ట్ర అధ్యక్షులు వెంకట నరసింహులు ( తిరుపతి,) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి శంకర్ జైకుమార్, బాపట్ల జిల్లా అధ్యక్షులు రెవ. తిమోతి, కంభంపాటి రమేష్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ , రెవరెండ్ జాషువా, నాగార్జున కర్లకుంట కాళీ మరికొందరు పాల్గొన్నారు.