ప్రజా వేదిక, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు రైతు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, అగమ్య గోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మద్దూరీ వీరారెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను పంపకము చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందని

పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో, తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారని,తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్నారని, సాగు చేసుకోవటానికి, తాగటానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నీళ్లనూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో నీళ్లు వాడుకుంటూ నీళ్లను వృధా చేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విషయంలో, ఏ ప్రభుత్వాలు, ఏ విధంగా రైతులకు మేలు చేశాయో, ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నప్పుడు, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశ ప్రభుత్వంలో రైతులకు మేలు చేస్తే, రైతులకు అన్యాయం చేశారని దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజలకు, రైతులకు ఎవరు మేలు చేశారో తెలిసిందని, రైతులకు అన్ని విధాలుగా దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని తెలియజేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన్ బాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు రైతు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, అగమ్య గోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మద్దూరీ వీరారెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను పంపకము చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందని

పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో, తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారని,తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతుల మనోభావాలను అర్థం చేసుకోకుండా కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్నారని, సాగు చేసుకోవటానికి, తాగటానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నీళ్లనూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో నీళ్లు వాడుకుంటూ నీళ్లను వృధా చేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విషయంలో, ఏ ప్రభుత్వాలు, ఏ విధంగా రైతులకు మేలు చేశాయో, ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నప్పుడు, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు మేలు చేస్తే, రైతులకు అన్యాయం చేశారని జగన్ దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజలకు, రైతులకు ఎవరు మేలు చేశారో తెలిసిందని, రైతులకు అన్ని విధాలుగా దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్తారని తెలిపారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నుండి, నీటి శాఖ మంత్రి వరకు రైతుల్లో భరోసా కల్పించలేకపోతున్నారని, గత ప్రభుత్వాల్లో రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు అని ప్రతి రైతు చెబుతారని, రైతులకు వ్యతిరేకంగా పరిపాలన చేశారని చంద్రబాబుపై అనేక తప్పుడు ఆరోపణలు చెసి, జగన్ అధికారంలోకి వచ్చారని, చంద్రబాబుపై, వారి కుటుంబం పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రైతులు తిరస్కరిస్తారని పేర్కొన్నారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రైతులు ఇచ్చిన భూముల్లో పరిపాలన చేస్తూ, రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, మరల అధికారంలోకి రావాలని చూస్తున్నారని అది సాధ్యం కాదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి మందలపు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు