ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

రోపణలు తప్ప ఆధారాలు చూపలేని,సన్నాసి ప్రభుత్వం….

సూర్యుడికి మరక,చంద్రబాబుకి అవినీతి మరక అసాధ్యం.

 

_*-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు*_

 

_అక్రమ కేసుతో అరెస్టు చేసిన చంద్రబాబుకు అండగా నిలవాలని నరసరావుపేట పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్,టీడీపీ నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.చంద్రబాబును అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందడం తప్ప జగన్ రెడ్డి సాధించేదేమీ లేదన్నారు.అధికారంలోకి రాక ముందు నుండి ఎన్నో ఆరోపణలు చేశారు.అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తైనా ఒక్క రూపాయి అవినీతి నిరోపించలేదన్నారు.ఇపుడు అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ లో కూడా చంద్రబాబుకి రూపాయి చేరింది అనడానికి ఆధారాలు చూపలేకపోతున్నారన్నారు.నీతిగా,నిజాయితీగా బతికిన చంద్రబాబు పై నిండలేయడం అంటే సూర్యునికి మరక అంటించడం లాంటిదే అన్నారు.జగన్ రెడ్డి కుట్రలు అన్నీ చెడించి చంద్రబాబు త్వరలోనే బయటకు రావడం తధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు._