ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నాగూర్ ని సన్మానించిన ప్రముఖ డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ
పల్నాడు జిల్లా నరసరావుపేట
ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా షేక్ నాగుర్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా నరసరావుపేట పట్టణ ప్రముఖ అనన్య హాస్పిటల్ డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగూర్ గతంలో నేటి యువత అనే ఒక స్వచ్ఛంద గ్రూపు ఏర్పాటు చేసి ఎంతోమందికి వారి మిత్రులు ద్వారా కరోనా టైం లో ఎంతోమందికి చేతనైనంత సహాయ సహకారాలు అందించిన వ్యక్తి నాగూర్ అని ఈరోజు రాష్ట్ర పదవి రావడం పట్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు ఇలాంటి పదవులు భవిష్యత్తులో మరెన్నో రావాలని ఆయనకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు.